Rudraksha Guide

Rudraksha Guide

రుద్రాక్షలు- ప్రాథమిక సమాచారం

చదువు
1

మరింత తెలుసుకోండి

చదువు
2

భద్ర పరచడం - నిర్వహణ

చదువు
3

కండీషనింగ్(ప్రక్రియ)

చదువు
4

రుద్రాక్షలు- ప్రాథమిక సమాచారం

రుద్రాక్ష అంటే ఏమిటి?

రుద్రాక్ష (రుద్రాక్ష్ అని కూడా పిలుస్తారు) అనేవి ఒక చెట్టుకు ఎండిన విత్తనాలు, ఈ చెట్లు ఆగ్నేయాసియాలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో పెరుగుతాయి, వీటిని వృక్షశాస్త్రపరంగా ఎలియోకార్పస్ గనిట్రస్ అని పిలుస్తారు. వీటిని "శివుని ఆనంద భాష్పాలు" అని కూడా పిలుస్తారు అలాగే శివునికి సంబంధించిన అనేక ఇతిహాసాలలో ఇవి ఎలా ఆవిర్భవించాయి అన్న వివరణ ఉంది. రుద్రాక్ష అనే పదం, “రుద్ర” (శివుడి పేరు) ఇంకా “అక్ష” అంటే కన్నీళ్లు, ఈ రెండు పదాల నుండి వచ్చింది.

రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

శారీరక మరియు మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో రుద్రాక్షాలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఆధ్యాత్మిక అన్వేషకులకు, ఇది వారి ఆధ్యాత్మిక పురోగతికి మద్దతు ఇస్తుంది. వీటి ఔషధ లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా అనేక శారీరకఇంకా మానసిక రుగ్మతలవల్ల కలిగే అనారోగ్యాలను నయం చేయడంలో ఉపయోగించబడుతూ ఉంటాయి.

రుద్రాక్షను ఎవరు ధరించవచ్చు?

లింగ, సాంస్కృతిక, జాతి, భౌగోళిక లేదా మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా రుద్రాక్షను ధరించవచ్చు. ఇవి మానసిక, శారీరక స్థితితో సంబంధం లేకుండా, జీవితంలో అన్ని దశలో ఉన్న వారి కోసమూ ఉద్దేశింపబడినవి. దీనిని పిల్లలు, విద్యార్థులు, వృద్ధులు ఇంకా అనారోగ్యంతో ఉన్న వారూ అనేక ప్రయోజనాల కోసం ధరించవచ్చు. దయచేసి క్రింద 5వ ప్రశ్న చూడండి.

పంచముఖి మాలా పూస సైజును ఎలా ఎంచుకోవాలి (5 మిమీ నుండి 8 మిమీ మధ్య ఉంటుంది)?

(మా పంచముఖి రుద్రాక్షాలన్నీ పరిమాణంతో సంబంధం లేకుండా ఒకే నాణ్యత, ప్రభావం ఇంకా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఏడు పరిమాణాలలో మీ ప్రాధాన్యతను బట్టి మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. చిన్న పూసలు దొరకడం అరుదు, అందుకే ధరలో వ్యత్యాసం ఉంటుంది.

ప్రతి రకమైన రుద్రాక్షల ప్రయోజనాలు ఏమిటి?

మేము అందించే రుద్రాక్షలను జాగ్రత్తగా ఎంపిక చేసి, వాటి నాణ్యత తనిఖీ చేసి, శక్తీకరిస్తాము. ప్రతి రకమైన రుద్రాక్షల ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • - పంచముఖి: ఇవి ఐదు ముఖాల రుద్రాక్షలు, వీటిని 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ధరించవచ్చు. ఇది అంతర్గత స్వేచ్ఛ ఇంకా స్వచ్ఛతను పెంపొందించడానికి సహాయపడుతుంది.
  • - ద్విముఖి: వివాహితుల కోసం ఉద్దేశింపబడిన రెండు ముఖాలు గల రుద్రాక్షలు ఇవి. ఇది వైవాహిక సంబంధాలకు తోడ్పడుతుంది అలాగే వీటిని భార్యాభర్తలిద్దరూ ధరించాలి.
  • - షణ్ముఖి: ఇవి 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఉద్దేశింపబడిన ఆరు ముఖాలు గల రుద్రాక్ష. ఇది సరైన శారీరక ఇంకా మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది.
  • - గౌరీ శంకర్: ఇవి రెండు పూసలు ఒకదానితో ఒకటి మిళితమైనట్టు ఉంటాయి, వీటిని 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ధరించవచ్చు. ఇది ఈడా ఇంకా పింగళ నాడుల (శక్తి ప్రవహించే నాడులు) శ్రేయస్సు ఇంకా సమతుల్యతకు సహాయపడుతుంది, అలాగే ఏడు చక్రాలను చైతన్యవంతం చేస్తుంది.
కొత్త రుద్రాక్షను వేసుకునేముందు ఏం చేయవలసి ఉంటుంది?

కొత్త రుద్రాక్షలను కండీషనింగ్ చేయడానికి, వాటిని నెయ్యిలో 24 గంటలు నానబెట్టండి, తర్వాత వాటిని పూర్తి కొవ్వు కలిగిన పాలలో మరో 24 గంటల పాటూ నానబెట్టండి. దాన్ని నీటితో కడిగి, పూసలను శుభ్రమైన గుడ్డతో తుడవండి. సబ్బు లేదా ఇతర శుభ్రపరిచే పదార్థంతో వాటిని కడగకండి. ఇలా సిద్ధం చేయడం వల్ల, రుద్రాక్ష రంగు మారవచ్చు, అది సహజమే ఎందుకంటే ఇవి సహజమైన పూసలు కాబట్టి. కండీషనింగ్ చేసే సమయంలో దారం రంగు కొద్దిగా బయటకు రావడం కూడా సాధారణమే. క్రింద వివరించిన విధంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి కండీషనింగ్ చేయాలి.

నా రుద్రాక్షకు ఎంత తరచుగా ఈ ప్రక్రియ (కండిషన్) ను చేయాలి?

ప్రతి ఆరునెలలకోసారి రుద్రాక్షలను కండీషనింగ్ చేయాలి. రుద్రాక్ష మాలా లేదా పూసలను కండీషనింగ్ చేయడానికి, వాటిని నెయ్యిలో 24 గంటలు నానబెట్టండి, తర్వాత వాటిని పూర్తి కొవ్వు గల పాలలో మరో 24 గంటల పాటూ నానబెట్టండి. దాన్ని నీటితో కడిగి, పూసలను శుభ్రమైన గుడ్డతో తుడవండి. సబ్బు లేదా ఇతర శుభ్రపరిచే పదార్థంతో వాటిని కడగకండి.

నేను రుద్రాక్ష మాలాను ఎప్పుడు ధరించవచ్చు?

మాలని అన్ని సమయాలలో ధరించవచ్చు. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు కూడా దాన్ని ధరించవచ్చు. మీరు గనుక చన్నీటి స్నానం చేస్తున్నట్లయితే, ఇంకా రసాయన సబ్బును ఉపయోగించకపోతే, నీరు దానిపై పడి ఆపై మీ శరీరంపై ప్రవహించడం చాలా మంచిది. కానీ మీరు గనుక రసాయన సబ్బులు వాడుతుంటే, అలాగే వెచ్చని నీటిని ఉపయోగిస్తుంటే, అది పెళుసుగా అయి కొంతకాలం తర్వాత దానికి పగుళ్లు ఏర్పడతాయి, కాబట్టి అలాంటి సమయాల్లో ధరించకుండా ఉండటం మంచిది.

మరింత తెలుసుకోండి

రుద్రాక్ష మాలకు ఎప్పుడూ 108 పూసలు ఉంటాయా?

లేదు. సాంప్రదాయకంగా, ఉండవలిసిన పూసల సంఖ్య, 108 పూసలు ఇంక బిందువు అనే ఇంకొక పూస. ఒక ఎదిగిన మనిషి, 84 పూసలు + ఒక బిందువు కన్నా తక్కువ పూసలు ఉన్న మాలని ధరించకూడదని సిఫార్సు చేయబడింది, కానీ దాన్ని మించి ఏ సంఖ్య అయినా పరవాలేదు! రుద్రాక్షల పరిమాణాన్ని బట్టి, మాలలోని పూసలు వివిధ సంఖ్యలలో ఉంటాయి.

అతిచిన్నవైన రుద్రాక్షలకు మరింత ఆధ్యాత్మిక స్వభావం ఉంటుందా?

అన్ని పంచముఖి రుద్రాక్షలు పరిమాణంతో నిమిత్తం లేకుండా ఒకే నాణ్యత, ప్రభావం ఇంకా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఏడు పరిమాణాలలో మీ ప్రాధాన్యతను బట్టి మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. చిన్న పూసలు దొరకడం అరుదు, అందుకే ధరలో వ్యత్యాసం ఉంటుంది.

నా రుద్రాక్షను వేరొకరితో పంచుకోవచ్చా?

లేదు, రుద్రక్షలు ధరించినవారికి అనుగుణంగా మారతాయి కాబట్టి, మీరు మీ రుద్రాక్షను మరెవరితోనూ పంచుకోకూడదు.

హఠ యోగా సాధన సమయంలో నా రుద్రాక్షను తీసివేస్తే దాన్ని ఎలా బధ్రపరచాలి ?

రుద్రాక్షను పట్టు వస్త్రంలో లేదా రాగి పాత్రలో భద్రపరచడం మంచిది. గుర్తుంచుకోండి, రాగి - పాల ఉత్పత్తులను ఆక్సీకరణం చేస్తుంది, కాబట్టి రుద్రాక్షను సిద్దం చేసేటప్పుడు మీరు రాగి పాత్రను ఉపయోగించకూడదు.

పంచముఖి మాల మీద ఉన్న బిందువును మెడపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచాలా?

పంచముఖి మాలలోని బిందువును మీ మెడలోని ఏ ప్రత్యేక భాగంలోనూ ఉంచాల్సిన అవసరం లేదు - మీరు నడుస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, మీ సాధన చేసేటప్పుడు, మీ రుద్రాక్ష కదులుతుంది. బిందువును మీ ఛాతీ మధ్యలో ఉండేలా ఉంచడం మంచిది, కానీ ఒకసారి మీరు మళ్ళీ కదలడం ప్రారంభిస్తే, బిందువు కూడా అవుతుంది. ఇది పరవాలేదు.

రుద్రాక్ష తన ప్రకంపనని(శక్తిని) కోల్పోయిందని మనం ఎలా చెప్పవచ్చు?

రుద్రాక్షకు సహజంగా ఒక నిర్దిష్ట గుణం ఉంటుంది, కాబట్టి రుద్రాక్షను గౌరవ భావనతో చూసే విధంగా వాటిని శరీరంపై ధరించడం చాలా ముఖ్యం. రుద్రాక్షను నగల లాగా ధరించకూడదు, అలాగే ఆ తరువాత పక్కన పెట్టకూడదు. ఒక వ్యక్తి రుద్రాక్షను ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు, అది వారిలో ఒక భాగంగా అవ్వాలి.

భద్ర పరచడం - నిర్వహణ

ఎవరైనా తమ రుద్రాక్షను ఎక్కువ కాలం పాటూ ధరించకుండా ఉండాలని నిర్ణయించుకుంటే, దానిని పట్టు వస్త్రంలో, పూజా గదిలో ఉంచాలి.

రుద్రాక్షకు అనుకూలంగా ఉండని కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు, రుద్రాక్షను సిమెంట్ నేలపై ఒక పూర్తి 48 రోజుల మండలా లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే, దానిని ఇక ఉపయోగించకూడదు. కండీషనింగ్(ప్రక్రియ) చేయడం అనేది, జరిగిన మార్పులను తిరగ రాయలేదు. ఇటువంటి స్థితిలో ఉన్న రుద్రాక్షను వీలైతే మట్టిలో పాతిపెట్టాలి, లేదా నది లేదా బావి వంటి నీటి వనరులలో అర్పించాలి.

మాలలో కొన్ని పూసలు పగిలితే, నేను పూర్తిగా కొత్త మాల కొనవలసిన అవసరం ఉందా?

రుద్రాక్ష మలలో పగుళ్లు ఉన్న పూసలను తొలగించాలి, ఎందుకంటే వాటి శక్తి మారుతుంది, అలాగే అది ధరించినవారికి అనువైనదిగా ఉండకపోవచ్చు. మాలలోని మొత్తం పూసల సంఖ్య 84, ప్లస్ బిందువు కన్నా ఎక్కువ ఉన్నంత వరకూ, 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి విషయంలో, పగిలిన పూసలకు బదులు కొత్త పూసలను అమర్చాల్సిన అవసరం లేదు. 14 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, దీనికి పైన ఉన్న ఏ సంఖ్య అయినా ధరించవచ్చు.

పగిలిన పూసలను తొలగించడానికి, మాలను తెరిచి తిరిగి పూసగుచ్చోచ్చు. తిరిగి పూసగుచ్చెటప్పుడు, ఏ పూసైనా బిందువుగా పనిచేయగలదు – అది మొదట ఉపయోగించినదే అవ్వాలనేమీ లేదు. 14 ఏళ్లలోపు వారు షణ్ముఖి రుద్రాక్ష మాత్రమే ధరించాలి.

రుద్రాక్ష మాల పూసలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి తాకుతూ ఉండాలా ?

రుద్రాక్ష యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలంటే, మాలాలో పూసలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి తాకుతూ ఉండాలి. ఇది మాలాలోని శక్తి కదలికతో సంబంధం కలిగి ఉంటుంది. మాలాను మరీ గట్టిగా గుచ్చకుండా ఉండటం ముఖ్యం, లేదంటే పూసలు ఒకదానికొకటి నొక్కుకుని, పగుళ్లు ఏర్పడవచ్చు. అన్ని పూసలూ తాకుతూ ఉండేలా, జాగ్రత్తగా పూసగుచ్చడం ఉత్తమం.

రుద్రాక్షను నిల్వ చేయడానికి లేదా కండీషనింగ్(ప్రక్రియ) చేయడానికి, ఉత్తమమైన పాత్ర ఏది?

రుద్రాక్షలు ప్రత్యేకమైన కూర్పు గల సహజమైన విత్తనాలు కాబట్టి, వాటిని సహజమైన పాత్రలలో భద్రపరచడం మంచిది. కండీషనింగ్ చేసినప్పుడు, మట్టి, గాజు లేదా చెక్క గిన్నెలను ఉపయోగించడం ఉత్తమం. ప్రత్యామ్నాయంగా, అందుబాటులో ఉంటే, బంగారం లేదా వెండి గిన్నెలను ఉపయోగించవచ్చు. కండీషనింగ్ చేసేటప్పుడు, నెయ్యి ఇంకా పాలు రాగితో ప్రతిస్పందించగలవు కాబట్టి రాగి గిన్నెలను ఉపయోగించకూడదు. కానీ కండీషనింగ్ చేస్తున్నప్పుడు కాకుండా మిగతా సమయంలో, రుద్రాక్షను రాగి పాత్రలో భద్రపరచడం మంచిది. రుద్రాక్షను నిల్వ చేయడానికి లేదా సిద్దం చేయడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగించడం అనువైనది కాదు ఎందుకంటే ప్లాస్టిక్‌లు స్పందించి హానికరమైన పదార్థాలను బయటికి పంపగలవు.

రుద్రాక్ష ధరించేటప్పుడు, దాని నాణ్యత ఇంకా బలం కారణంగా, ఉపయోగించడానికి, సిల్కు దారం ఉత్తమమైన సహజ ఎంపిక. విత్తనాలు పగలకుండా ఇంకా వాటికి ఏ హానీ జరగకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పూసగుచ్చినట్లైతే, సన్నని బంగారు లేదా వెండి గొలుసులు కూడా ఉపయోగించవచ్చు.

గౌరీ శంకర్‌ రుద్రాక్షను పంచముఖి రుద్రాక్ష మాలకు ఎలా కట్టాలి?

గౌరీ శంకర్ రుద్రాక్ష, పంచముఖి మాల చివర కట్టడానికి, లేదా ఏదైనా పట్టు దారానికీ లేదా బంగారం లేదా వెండి గొలుసుకు సులభంగా కట్టడానికి ఉద్దేశించిన ఒక మెటల్ లూప్ తో వస్తుంది. పంచముఖి మాలాకు గౌరీ శంకర్‌ను జోడించినప్పుడు, బిందును ఆ స్థలంలోనే ఉంచడం ముఖ్యం; గౌరీ శంకర్‌ను అదనపు పూసగా బిందువుకు క్రింద చేర్చవచ్చు. బిందువు ముఖ్యం, ఎందుకంటే అది మాలాలోని శక్తి ప్రవాహం వృత్తాకారంలో ఉండకుండా చూస్తుంది. అది వృత్తాకారంగా మారితే, కొంతమందికి అది మైకంగా అనిపించేలా చేస్తుంది.

కండీషనింగ్(ప్రక్రియ)

నకిలీ రుద్రాక్షను గుర్తించడానికి ఏవైనా స్పష్టమైన మార్గాలు ఉన్నాయా?

సద్గురు: సాంప్రదాయకంగా, ఎప్పుడూ కూడా, తమ జీవితంలో దాన్ని ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించే వ్యక్తులే మాలలతో వ్యవహరించేవారు. తరతరాలుగా, వారు కేవలం ఇది మాత్రమే చేశారు. వారు దీని ద్వారా తమ జీవనోపాధిని కూడా పొందారు,కాని ప్రాథమికంగా ఇది, ప్రజలకు దీనిని అందించే పవిత్రమైన బాధ్యత లాంటిది. కానీ ఒకసారి గిరాకీ చాలా ఎక్కువవ్వ గానే, వాణిజ్యం వచ్చింది. నేడు భారతదేశంలో, బద్రాక్ష్ అనే మరో విత్తనం ఉంది, ఇది విషపూరిత విత్తనం, ఇది ఉత్తర ప్రదేశ్, బీహార్ ఇంకా ఆ ప్రాంతంలో చాలా విస్తృతంగా పెరుగుతుంది. చూడటానికి, ఈ రెండు విత్తనాలూ ఒకేలా కనిపిస్తాయి. మీరు తేడా కనిపెట్టలేరు. మీకు కొంత సున్నితత్వం ఉంటేనే, అలాగే మీరు దాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మాత్రమె,మీకు తేడా తెలుస్తుంది. వీటిని శరీరంపై ధరించకూడదు, కానీ వీటిని చాలా చోట్ల నిజమైన రుద్రాక్షలుగా అమ్ముతున్నారు. కాబట్టి మీరు మీ మాలను విశ్వసనీయమైన వారి నుండి పొందడం చాలా ముఖ్యం.

రుద్రాక్షలను మళ్ళీ కండీషనింగ్(ప్రక్రియ) చేయడం అనేది, వాటిని "మళ్ళీ శక్తివంతం చేస్తుందా"? లేదా అది కేవలం పెళుసుదనం/పగుళ్లు నుండి రక్షణ కల్పించడం కోసమేనా?

కండీషనింగ్ చేయడం అనేది, రుద్రాక్షలు పెళుసుగా అయి, పగుళ్లకు గురికాకుండా నిరోధించడం ద్వారా వాటి జీవితకాలాన్ని పెంచడం కోసం. ప్రతి 6 నెలలకు నెయ్యి ఇంకా పాలలో ఉంచడం, ఇంకా ప్రతి 1 నుండి 2 సంవత్సరాలకు నువ్వుల నూనెలో ఉంచడం, రుద్రాక్ష యొక్క సమగ్రతకు ప్రయోజనకరంగా ఉంటుంది. కండీషనింగ్ చేయడం అనేది రుద్రాక్షను మళ్ళీ శక్తీకరించదు. కేవలం స్వభావ రీత్యా మాత్రమే రుద్రాక్షలు ఒక నిర్దిష్ట నాణ్యతను కలిగి ఉంటాయి.

కండీషనింగ్(ప్రక్రియ) చేసిన తర్వాత, రుద్రాక్ష మాల జిడ్డుగా, కొద్దిగా వాసనతో ఉంటుంది. ఈ విషయమై ఏమైనా చేయవచ్చా?

రుద్రాక్షను కండిషనింగ్ చేసిన తరువాత, అది కొద్దిగా జిడ్డుగా ఉండొచ్చు, అలాగే నెయ్యి ఇంకా పాల వాసన రావొచ్చు. ఏదైనా అదనపు నూనెను తొలగించడంలో సహాయపడటానికి, కండిషనింగ్ లో ఆఖరి అడుగుగా రుద్రాక్షను విభూతిలో ఉంచవచ్చు. అలా చేయడానికి, మీ అరచేతిలో కొంత విభూతి తీసుకొని దానిలో రుద్రాక్షను మెల్లగా పోర్లించండి. ఇలా చేసే ముందు రుద్రాక్షను నీటితో లేదా సబ్బుతో కడగకూడదు. పాల నుండి తీసిన తరువాత నేరుగా రుద్రాక్షకు విభూతిని పూయాలి.

కండీషనింగ్(ప్రక్రియ) చేసిన తర్వాత, ఆ నెయ్యిని పారేయాలా? వచ్చే సారి సిద్దం చేస్తున్నప్పుడు ఉపయోగించవచ్చా లేదా వంటలలో ఉపయోగించవచ్చా?

ఒకసారి మీరు రుద్రాక్షను నెయ్యిలో 24 గంటలు కండిషన్ చేసిన తర్వాత, ఆ నెయ్యిని మొక్కలకు వేయవచ్చు, దీపంలో నూనెగా ఉపయోగించవచ్చు, లేదా వచ్చే సారి కండీషనింగ్ చేయడం కోసం భద్రపరహవచ్చు. మిగిలిపోయిన నెయ్యిని తినకూడదు, వంటలో వాడకూడదు.

కొత్త రుద్రాక్షను కండీషనింగ్(ప్రక్రియ) చేసేటప్పుడు, పూసల నుండి కొన్నిసార్లు పసుపు రంగులో ద్రవం వస్తుంది - ఇది సాధారణమేనా?

రుద్రాక్షను కొన్నాక, మొదటిసారి కండీషనింగ్ చేసినప్పుడు, పూసల నుండి కొంత లీకేజీ ఉండవచ్చు. దాని రంగు వేరు కావచ్చు, కాని సాధారణంగా పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. ఇలా జరగడానికి కారణం, ఒక రక్షణ ప్రక్రియ, అదేంటంటే సాగుదారుల నుండి తెచ్చిన తరువాత, వాటిని మట్టితో కప్పుతారు. రుద్రాక్షకు మట్టి పూయడం అనేది, విత్తనం చెట్టు నుండి వచ్చినప్పుడు ఎలా ఉందో అదేవిధంగా దాని అసలు స్థితిలో ఉండేలా చూస్తుంది. రంగులో తేడా అనేది, ఎక్కడ నుండి వచ్చిన మట్టిని వాడారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

నేను రుద్రాక్షను ధరించినప్పుడు, కాలం గడిచే కొద్దీ రుద్రాక్షలు ఒత్తైనా రంగులోకి మారాలా? ఇలా ఎందుకు జరుగుతుంది?

రుద్రాక్ష, అది గ్రహించే పదార్థాల వల్ల కాలం గడిచే కొద్దీ ముదురు రంగులోకి మారుతుంది; ఇది క్రమంగా కండిషనింగ్ కోసం ఉపయోగించే నెయ్యి, పాలు ఇంకా నువ్వుల నూనె, అలాగే మీ సహజ శరీర నూనె ఇంకా చెమటల కలయిక. ఇది సహజ ప్రక్రియ; దీనికీ, సాధనకీ లేదా దీనికీ, యోగ అభ్యాసాలకీ ఏ సంబంధం లేదు.

Rudraksha Offerings

© 2022 - 2024 Isha Life Pvt. Ltd. All Rights Reserved.